విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా గోపాష్టమి వేడుకలు

Share this:

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో సమున్నత మాతృస్థానం పొందే జీవులలో గోమాత ఒకటి…అశేష హిందూ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే గోవును నేడు గోపాష్టమి సందర్భంగా కర్నూలు నగరంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో నిర్వహింపబడినది
1 వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధి శ్రీ రామాలయ ప్రఖంఢ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ లితాపీఠం లో పీఠాధిపతులు ‌శ్రీసుబ్బిస్వామి (మేడాసుబ్రహ్మణ్యం) సహకారంతో వైభవంగా గోపూజా కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథి గా హాజరైన ఆర్.యస్.యస్.నాయకులు విఠల్ పవార్ మాట్లాడుతూ ప్రపంచంలో మలమూత్రాదలు ఔషధాలుగా వాడే జీవి ఒక్క గోమాతే ననీ అటువంటి గోవును గోపాషచటమీ రోజున పూజించడం ఎంతో పుణ్యదాయమనీ తెలియజేశారు,ఏ.వీ.ప్రసాద్,నీలి నరసింహ,భగీరథ,రాజశేఖర్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల చెక్ పోస్ట్ వద్ద గల రెవెన్యూకాలనీలోని శ్రీ భరతమాత ప్రఖంఢ లోని భరతమాత ఆలయంలో ప్రఖంఢ అధ్యక్షులు గురుప్రసాద్ ఆధ్వర్యంలో విశ్వహిందూపరిషత్ జిల్లా కార్యాధ్యక్షులు కే.కృష్టన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు గోవ్యర్థాలతో పండించిన పంటలను ఆర్గానిక్స్ పేరుతో విరివిగా వాడుతున్నారనీ ఇది మంచి పరాణామమనీ ప్రశంచించారు దేశినేని దేవనాయుడు,అయోధ్య శ్రీనివాసరెడ్డి,రాము,ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రఖంఢలో కొండారెడ్డి నగర్ లోని భవానీశంకర దేవాలయం లో బజరంగ్దళ్ కన్వీనర్ రాము అధ్వర్యంలో వీధిలోని ప్రజలు,మాతృమూర్తులు పాల్గొనగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి విజయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సర్వదేవతా నిలయమైన కామధేనుగోవును తల్లిగా ఆరాధిస్తారనీ అటువంటి గోవును కొందరు విచక్షణ రహితంగా చంపుతున్నారు నీ ఆవేదన వ్యక్తం చేశారు.
4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హరిశ్చంద్ర శరీన్ నగర్ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతా రామాలయం లో విశ్వహిందూ పరిషత్ నగర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి ఆధ్వర్యంలో గోపాష్టమీ గోపూజ అంగరంగ వైభవంగా జరిగింది విశ్వహిందూ పరిషత్ కర్నూలు నగర కార్యాధ్యక్షులు ముఖ్య అతిథిగా విచ్చేసిన గోరంట్లరమణ మాట్లాడుతూ కాన్సర్ వంటి ఎన్నో ఔషధాలలో గోమూత్రం,గోమయం ఉపయోగిస్తున్నారనీ, ప్రపంచంలో ఏజీవికీ లేని విలక్షణ తత్వం గోమాతకు ఉన్నదని అటువంటి గోవును, భారత దేశంలో 85 శాతం ఉన్న హిందువులు పూజించే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గౌరవ ప్రధాన మంత్రి గారికి రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈకార్యక్రమంలో శ్రీ శారద మాతా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం సభ్యులు, విశ్వహిందూ పరిషత్ నగర కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ బజరంగ్దళ్ నగర సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్,ప్రఖంఢ బజరంగ్దళ్ కార్యకర్తలు లోకేశ్,దుర్గాప్రసాద్,ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply