వెల్లంకిలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత వర్ధంతి

Share this:

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త, న్యాయ కోవిదుడు, రాజ్యాంగం ద్వారా దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సోమవారం వెల్లంకిలో బిఎస్పీ వెల్లంకి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంటరానితనం, అసమానతలు, వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్‌ అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో చిట్యాల కన్వీనర్ యకరి కవిత మండల సహాయ కార్యదర్శి నకిరేకంటి రాజు,ఫిట్ ఇండియా జిల్లా సహాయ కార్యదర్శి తలారి గణేష్,కట్ట మహేందర్,నకిరేకంటి సతీష్,గునే శ్రీకాంత్,సండ్ల శివాజీ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply