శ్రీరామలింగేశ్వర దేవాలయంలో కాకతీయుల కాలంనాటి దేవతా విగ్రహాలు లబ్యం

Share this:

మునగాల మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర దేవాలయంలో కాకతీయుల కాలంనాటి దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో నైరుతి భాగంలో ఉన్న రేకుల షెడ్డును తొలగించి నూతన గదులను నిర్మించేందుకు ఆలయ కమిటీ సభ్యులు పనులు ప్రారంభించారు.ఇందులో భాగంగా జీసీబీ సహాయంతో పునాది ఐదు అడుగుల లోతు తవ్వగా కాకతీయుల కాలంనాటి 16 విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ విగ్రహాల్లో అలివేలుమంగ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణస్వామి, రుక్మిణీ సత్యభామ, వేణుగోపాలస్వామి, శ్రీకృష్ణుడు, శ్రీదేవి, భూదేవి తదితర విగ్రహాలున్నాయి. దేవాలయంలో విగ్రహాలు బయటపడ్డాయని తెలియడంతో భక్తులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు.ప్రజలు ఆశ్చర్యంగా వాటిని తిలకించారు. ఇవి ఏ కాలం నాటిది ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన అని చర్చించుకున్నారు.నిజాం ప్రభువు పాలనలో హిందూ దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండటంతో వాటిని కాపాడటానికి భూమిలో భద్రపరిచి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply