శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్ కంపెనీలో కార్మికుడు మృతి

Share this:

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాముల శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్ కంపెనీలో కార్మికులకు కేటాయించిన గదిలో ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది…ఇది ఇలా ఉండగా.. కార్మికుడు మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోంది.. కార్మికుడు ఏవిధంగా చనిపోయాడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది..మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన వసీమ్ అక్రమ్ ఫ్యాక్టరీ లో జెసిబి డ్రైవర్ గా పని చేస్తున్నాడు.. మృతికి కారణాలు తెలియరాలేదు..
మృతుని తరపున ఎవరూ బంధువులు లేకపోవటం మృతుని స్వస్థలం బీహార్ రాష్ట్రం కావటంతో ఫ్యాక్టరీలో చనిపోయిన విషయం వారి బంధువులకు కూడా చేరలేదు.. మీడియాకు యాజమాన్యం స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.. అయితే మృతుడు ఫ్యాక్టరీ లో జెసిబి డ్రైవర్ గా పని చేస్తున్నాడని తెలుస్తోంది.. మృతుడు నిద్రించినా స్థితిలో కార్మికులకు కేటాయించిన గదిలో ఒంటరిగా విగతజీవిగా పడి ఉండటం . మృతుని శరీరంపై ఎటువంటి గాయాలు అవ్వకపోవటం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.. కనీసం మృతుని తరపున మాట్లాడే వారు లేకపోవడం.. బంధువులు వస్తే మృతికి దారి తీసిన కారణాలు తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది.. పోస్టుమార్టం నివేదిక వస్తే గాని చెప్పలేని పరిస్థితి.. .. తెలుస్తోంది.. ఏది ఏమైనప్పటికీ వలస కూలీల మరణాలను పారదర్శకంగా నిగ్గుతేల్చిన అవసరం ఎంతైనా ఉంది.. పొట్టకూటి కోసం రాష్ట్రంగానే రాష్ట్రానికి వచ్చి విగతజీవిగా అనాధ శవాలుగా మారుతున్న సంఘటనలు ఫ్యాక్టరీలలో చోటుచేసుకోవటం వివాదాస్పదమవుతోంది….

Leave a Reply