శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం

Share this:

హైదరాబాద్, V3 న్యూస్ : హైదరాబాద్ మౌలాలి తిరుమల నగర్ ఆర్టీసీ కాలనీలోని శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ పూజారుల సమక్షంలో కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన కావాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతో స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.లాక్ డౌన్ ముగిసిన తర్వాత స్వామివారి కల్యాణాన్ని వైభవంగా ప్రజల మధ్య నిర్వహిస్తామని అన్నారు.

Leave a Reply