శ్రీ సత్య సాయి జిల్లా నూతన కలెక్టర్ గా బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ గా దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

Share this:

శ్రీ సత్య సాయి జిల్లా(V3News ) 05-04-2022: శ్రీ సత్య సాయి జిల్లా మొట్టమొదటి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్,జాయింట్ కలెక్టర్ గా దినేష్ కుమార్ లు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 6:30 జిల్లా సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు.కలెక్టర్,జాయింట్ కలెక్టర్ లకు రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయం చేరుకొని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆవిర్భావంతో పుట్టపర్తిలో పండుగ వాతావరణం నెలకొంది. పుట్టపర్తి,కదిరి,పెనుగొండ, ధర్మవరం,మడకశిర, హిందూపురం అరు నియోజకవర్గాలను కలుపుతూ సత్యసాయి జిల్లా ఆవిర్భవించింది. మొత్తం 8,925 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో , 18 లక్షల 40 వేల జనాభా, 32 మండలాలు శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోకి వస్తాయి. అదే విధంగా పుట్టపర్తి,కదిరి,ధర్మవరం, పెనుగొండ నాలుగు రెవెన్యూ డివిజన్ల తో పరిపాలన కొనసాగనుంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. అన్ని శాఖలకు ప్రభుత్వ భవనాలు సమకూర్చుకొని సర్వాంగ సుందరంగా సత్యసాయి జిల్లా భవనాలను తీర్చిదిద్దారు. పట్టణములో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి తో నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిధిలోని వైసిపి ఎమ్మెల్యేలు,ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply