శ్రీ సమ్మక్క – సారలమ్మ లను దర్శించుకున్న డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాలోతు నెహ్రు నాయక్

Share this:

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తండ: శ్రీ సమ్మక్క – సారలమ్మ లను దర్శించుకున్న డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాలోతు నెహ్రు నాయక్. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం కస్నాతండా గ్రామంలోని కుంటా x రోడ్డు దగ్గర వెలిసిన వన దేవతలు కోరిన కోరికలు తీర్చే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మూడు రోజులు పాటు ఘనంగా జరిగాయి. చుట్టుప్రక్కల వివిధ మండలాలు గ్రామాల నుండి ప్రజలు జాతరకు వచ్చి అమ్మవారిని నిలువెత్తు బంగారం చెల్లించి, వేటపోతులు, కోళ్లు కోసి అమ్మవారి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రు నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొండపల్లి రఘురామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డిఎస్ జగదీష్, మండల నాయకులు బానోత్ దేవ్సింగ్ నాయక్, మాజీ ఎంపిటిసి బానోత్ శంకర్ నాయక్, అనంతుల ఉపేందర్ గౌడ్, బానోత్ శ్రీను నాయక్, తారాచంద్, గంట యాకేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇంచార్జ్ మోహన్,ఆలయ కమిటీ చైర్మన్ బానోతు మంగీలాల్, శంకర్,పాకిరా, యువకులు బొడ సునీల్, భానోత్ అశోక్, ఆలయ పూజారులు సతీష్, కవిత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply