షాపులు తెరవాలని నిరసన

Share this:

ఓర్వకల్ , V3 న్యూస్ : కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గం.నుండి 9 గం. వరకు ప్రజలకు అవకాశం కల్పించాలని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.కరోనా మహమ్మారి విజృంబిస్తున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ లో గల యాభై రోజుల నుండి పనులు లేక, గ్రామంలో నిత్యావసర సరుకులు దొరకక తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుండి 9 గంటల వరకు షాపులు తెరవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply