సంక్షేమ పథకాల క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Share this:

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలో వివిధ వార్డులలో ఉదయం 07:00 AM నుండి 10:30 AM వరకు స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి* వారికి మంజూరైన Rs.19,02,204/- (రూపాయలు పంతొమ్మిది లక్షల రెండు వేల రెండు వందల నాలుగు)* విలువ గల 19 కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్* చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఒకవైపు ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యతను కల్పిస్తూ కళ్యాణలక్ష్మీ / షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డ పెళ్ళికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply