సత్తా చాటిన బిజెపి

Share this:

  • 28 సర్పంచ్ స్థానాలు జమ్మలమడుగు తాలూకాలో
  • మైలవరం మండలంలో మేజర్ పంచాయతీలు గెలుపు

జమ్మలమడుగు V3 రిపోర్టర్: జమ్మలమడుగు నియోజక వర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీలను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవగుడి ఆది నారాయణ రెడ్డి నేతృత్వంలో గెలుచుకుని సత్తా చాటుకుంది.నియోజక వర్గంలో దేవగుడి,దర్మాపురం, సున్నపురాల్లపల్లె,శేశారెడ్డి పల్లె,పెద్ద దండ్లూరు,పి.సుగుమంచి పల్లె,గొరిగేనూరు, గండికోట,మోరగుడి,మైలవరం మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలు అయిన వేపరాల, దొమ్మరనంద్యాల,కరమలవారి పల్లె,నవాబుపేట,బెస్తవేముల,లింగాపురం,ఎర్రగుంట్ల మండలంలో పోట్లదుర్తి,కలమల్ల,కొండాపురం మండలంలో టి.కోడూరు,సంకేపల్లి, బి.కొట్టాలపల్లె,బెడుదూరు,పెద్దమొడియం మండలంలో పాలూరు,జే. కోట్టాల పల్లె,పాపాయ పల్లె,ముద్దనూరు మండలంలో బొందలకుంట, ఉప్పలూరు, కొలవలి,తిమ్మాపురం మొత్తం 28 పంచాయతీలు గెలుచుకుని సత్తా చాటింది.ముఖ్యంగా మైలవరం మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన వేప రాలా పంచాయతీ నీ బిజెపి అభ్యర్థిని పల్లా శ్రీదేవి 225 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.వార్డు మెంబర్లు గా మద్దకం రామచంద్రుడు, కళ్ళే రమణయ్య,రబ్బ గీత,పల్లా కృష్ణ మూర్తి,గంజికుంట గోవిందు, పిట్టి రాజన్న, మద్ధకం లక్ష్మీ కాంత, నారెరామలక్షుమ్మ,కాటా లక్ష్మీదేవి, గంజికుంట వెంకటేష్ గెలుపొందారు.వేపరాల గ్రామం మైలవరం మండల బిజెపి అధ్యక్షుడు నగళ్లపాటి శ్రీనివాసులు సొంత గ్రామం. మండలంలో బిజెపి పార్టీ సత్తాను చాటిన కార్యకర్తలు,నాయకులు అందరికీ,ఆయన శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు

Leave a Reply