సరస్వతి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్

Share this:

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతాళ సరస్వతి కుటుంబాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకునారు. అనంతరం LJ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతాళ సరస్వతి దూరప్రాంతాలకు బదిలీ చేయడంతో మనస్తాపంతో బలవన్మరణం చెందిందని ఇకనైనా జీవో నంబర్ 317 తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ, భీంగల్ మండల బిజెపి అధ్యక్షుడు, మైపాల్, నరసయ్య, మల్లికార్జున్, యోగేశ్వర్ నరసయ్య, మధు, రంజిత్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply