సహాయకచర్యలు చేపట్టి మానవత్వం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి

Share this:

ద్విచక్ర వాహనాన్ని తప్పుంచ బోయిన బస్సు

డ్రైవర్ చాకచక్యంతోసైడ్ కాలువలోకి

ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

అందరూ క్షేమం

సహాయకచర్యలు చేపట్టి మానవత్వం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట (వి3న్యూస్) హైదరాబాద్ నుండి జనగామ దిశగా వేడుతున్న బస్సు ప్రమాదం నుండి తృటిలో బయటపడింది.అదుపు తప్పిన ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ చాక చక్యంగా బస్సును సైడ్ కాల్వలోకి తప్పించాడు.ఈ సంఘటన ఆలేరు జనగామ సరిహద్దుల్లో ఈ సాయంత్రం జరిగింది.
ఒక్కసారిగా జరిగింది ఈ సంఘటన తో ఉలిక్కిపడిన ప్రయాణికులు హాహాకారాలు చెయ్యడంతో అప్పుడే అటుగా వేడుతున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన కాన్వాయ్ ని నిలిపి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఒక్కొరితో మాట్లాడి పరామర్శించారు.అంతే గాకుండా మంత్రి జగదీష్ రెడ్డి సూచనతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయనికులందరికి మంత్రి వ్యక్తిగత సిబ్బంది మంచి నీళ్ళు అందించి వారిని భయాందోళన నుండి ఉపశమనం కలిగించారు.యాదాద్రి నుండి ఆలేరు మీదుగా సూర్యాపేట కు ప్రయాణిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా దిగి రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి మానవత్వం చాటుకున్న తీరును ప్రయాణికులతో పాటు ఆర్టీసి డ్రైవర్ ప్రశంశించారు.
అంతటి వెగంలోనూ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.


Leave a Reply