సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో ల‌యన్స్ క్ల‌బ్ సేవ‌లు అభినంద‌నీయం..మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు

Share this:

వరంగల్ (V3News): సామాజిక సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.ములుగురోడ్డు లోని వజ్ర గార్డెన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ కృషి ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతమ్ బుద్ధ లయన్ ప్రాంతీయ సదస్సు రీజియన్ చైర్మన్ చెన్నమనేని జయశ్రీ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా చెన్నమనేని జయశ్రీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఉషా దయాకర్ రావు దంపతులు అభినందించారు. అనంతరం నూతన సావనీర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ మన సమాజంలో ఆపదలో ఉన్న పొరుగువారికి సహకారం అందించాలనే సదాశయంతో ల‌య‌న్స్ క్ల‌బ్ ఏర్ప‌డ‌టం అభినందనీయమ‌న్నారు. ‘ మేము సేవ చేస్తామనే నినాదముతో సమాజములో విభిన్న జాతులు మతాలు, సాంప్రదాయలు కలిగియున్న ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని కలిగిస్తూ అవసరార్థులను గుర్తించి అవసరమైన సమయంలో ఆదుకొంటు,ప్రపంచములోని అతిపెద్ద సభ్యులను కలిగిన స్వచ్చంధ సేవా సంస్థగా ల‌య‌న్స్ క్ల‌బ్ ప్రజల మన్నలను పొంద‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. వివిధ ప్రాంతాలలో ఉత్తమ సేవలందించిన లయన్స్ క్లబ్ సభ్యులను,లయన్ అఫ్ ది రీజియన్ కటంగూరు రాంగోపాల్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ మచ్చ రాజిరెడ్డి దంపతులు,విడిజీలు లయన్స్ పరశురాములు, వెంకటేశ్వరరావు,పూర్వ జిల్లా గవర్నర్లు తమ్మెర లక్ష్మినరసింహరావు,పొట్లపల్లి శ్రీనివాసరావు,కే.సి.జాన్ బన్నీ,చందర్ పోకల,డాక్టర్ సుధాకర్ రెడ్డి,క్యాబినెట్ సభ్యులు లింగముర్తి,కృష్ణారెడ్డి, కటంగూరు రాంగోపాల్ రెడ్డి, కుందూరు వెంకట్ రెడ్డి,పుట్టా హరికిషన్ రెడ్డి,డాక్టర్ తాళ్ల రవి,డాక్టర్ అజిత్ కుమార్,ఆకుల మహేశ్,చంద్రగిరి ప్రసాద్, మార్కాల యదిరెడ్డి,వెంకట రమణా రెడ్డి,సుధాకర్ రెడ్డి, తిరుణహరి నరేందర్,పెండం వేణుమాధవ్,జోన్ చైర్మన్లు డాక్టర్ లక్ష్మి నారాయణ గోపు రఘుపతి రెడ్డి,వి.టి.శ్రీనివాస్, వివిద క్లబ్ ల బాద్యులు పాల్గోన్నారు.

Leave a Reply