సాహితీ భారతి ఆధ్వర్యంలో జావపద కళ బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ 102 వ జయంతి సభ

Share this:

బాపట్ల లో సాహితీ భారతి ఆధ్వర్యంలో జావపద కళ బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ 102 వ జయంతి సభ కార్యక్రమం నిర్వహించారు.అత్యంత ప్రజాదరణ పొందిన జానపద కళ అయిన బుర్రకథను దశదిశలా ప్రచారం చేసిన ప్రజా కళాకారుడు షేక్ నాజర్ అని,అంతరించిపోతున్న బుర్రకథకు ప్రాణం పోసి కొత్త ఆహార్యాన్ని రూపొందించి చక్కటి హావ భావ ప్రకటనతో ప్రపంచ ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొన్న కళాకారుడు షేక్ నాజర్ అని సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన షేక్ నాజర్ 102వ జయంతి సభకు అధ్యక్షత వహించిన సాహితి భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ తెలియజేశారు. ప్రఖ్యాత కవి “ఆక్సి” మాట్లాడుతూ నాజర్ కళ అనేది సమాజహితానికి, సమసమాజ స్థాపనకు దోహదపడాలని విశ్వసించి అదే బాటలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయక ఆశయం కోసం పాటుపడిన నిజమైన ప్రజా కళాకారుడు నాజర్ అని వారికి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా వాటిని కాదని బుర్రకథ కళను ప్రజా బాహుళ్యం లోకి తీసుకెళ్ళిన బుర్రకథ పితామహుడు అని ,వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది అని ,వారు జానపద కళారంగానికి చేసిన సేవ అనన్యసామాన్యమని తెలియజేశారు .ఈ సభలో ఆదం షఫీ ,మర్రి మాల్యాద్రి రావు, పువ్వాడ వెంకటేశ్వర్లు, జాకబ్, కస్తూరి శ్రీనివాస రావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు , మురళి రాధాకృష్ణ మూర్తి ,తదితరులు పద్మశ్రీ నాజర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply