సింగరేణి గని కార్మికుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం

Share this:

ప్రజల దశాబ్దాల కళ మెడికల్ కళాశాల సాధించా-రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

రక్తన్ని చేమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి గని కార్మికులంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అమితమైన అభిమానం… సింగరేణి కార్మికులసంక్షేమం కోసం అహర్నిషలు పాటుపడుతూ… గత పాలకులు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి గని కార్మికుల వారసులకు కారుణ్యనియమాకాలు తిరిగి కల్పించిన కార్మిక పక్షపాతి గని కార్మికుల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం రామగుండం రిజీయన్ 1 పరిధిలోని 2 ఎ ఇంక్షయున్ ఏరియా వర్క్ షాప్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నూతన క్యాలెండర్ కార్మికుల అందించారు. అనంతరం రామగుండానికి మెడికల్ కళాశాల మాంజూరు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కార్మికులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చేందుకు కేసీఆర్ తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ఉద్యమధీరులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆన్నారు. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ
రాష్ట్రానికి శ్రీరామరక్షని 2014లో 66మందిని, 2018లో 88మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు. సమాఖ్య పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమంను పట్టించుకోలేదని, తెలంగాణ ఏర్పాడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాకా సింగరేణిలో గత పాలకులు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియమాకాలతో 16 వేల మందికి సింగరేణిలో ఉద్యోగాలు కల్పించిన మహనాయకులు సిఎం కేసీఆర్ అన్నారు. సిఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నకా ప్రత్యేకంగా కోల్ బెల్ట్ శాసనసభ్యులు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్మిలకు సమస్యలు పరిష్కరం చేస్తున్నరన్నారు. టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికేఎస్ ద్వారా కార్మిక హక్కులు సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు.

రైతులను రాజులుగా మార్చేందుకు రైతుబంధు, ఉచితంగా 24గంటల కరెంట్, సకాలంలో ఎరువులు, పేద అడబిడ్డల పెళ్లిల కోసం కళ్యాణలక్ష్మి, వృద్ధులు, వికలాంగుల ఆసరా పధకలాంటి ఎన్నో ప్రజహిత పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఎకైక సిఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నా అభివృద్ధి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రాల్లో జరుగడం లేదని, దేశానికే ఆదర్శంగా సిఎం కేసీఆర్ పాలన నిలుస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రధాత సిఎం కేసీఆర్ పట్ల,టిఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ,బిజేపి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనోధ్యమంలో రామగుండం నియోజవర్గంలో ఉద్యమాన్ని ముందుండి నడిపించామని, వందలాది కేసులు పెట్టిన… జైల్లో పెట్టిన మెక్కవోని ధైర్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాడి సాధించమన్నారు.రామగుండం నియోజవర్గ ప్రజలకు సేవ చేయడం పమమావధిగా భావిస్తు సేవ చేస్తున్నమని నిత్యం 18 గంటలు ప్రజ సేవకే వెచ్చిస్తున్నమన్నారు. 50ఏళ్ల ప్రజల ఆకాంక్ష అయిన మెడికల్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కి పలుమార్లు విన్నవించి ఓప్పించి రామగుండానికి మెడికల్ కళాశాల సాధించామన్నారు. సివిల్ తదగాల్లో కక్షిదారులు పెద్దపల్లి, కరీంనగర్ కోర్టు వెళ్లాల్సివస్తుందని ప్రజలు, న్యాయవాదులు గోదావరిఖనిలో సీనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరిన క్రమంలో తాము అసెంబ్లీ ప్రస్తవించి, సిఎం కేసీఆర్ కి విన్నవించి గోదావరిఖనికి సీనియర్ సివిల్ కోర్టు మాంజూరు చేయించమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కేసీఆర్ కు మద్దతుగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ టిబిజికెఎస్ నాయకులు గండ్ర దామోదర్ రావు జహీద్ పాషా చెలకలపల్లి శ్రీనివాస్ కనకం శ్యాంసన్ వడ్ధెపల్లి శంకర్ మండ రమేష్ తోకల రమేష్ శేషగిరి పుట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply