సిటీ మహిళా డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు… ప్రిన్సిపాల్ రాజేందర్

Share this:

హన్మకొండ వీబీఆర్ కాంప్లెక్స్ లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలచే ముగ్గులు,మెహందీ పోటీలను ఘనంగా నిర్వహించామని గురువారం ప్రిన్సిపాల్ రాజేందర్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజేందర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు,ప్రతిభ వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినిలు వేసిన ముగ్గులు, మెహందీ చూపరులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రాజేందర్ రెడ్డి,అధ్యాపకులు పులి శ్రీనివాస్,అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు

Leave a Reply