సి.ఈ.ఆర్ క్లబ్ లో కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్,వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు

Share this:

రామగుండం 16-12-2021: కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడా వసతులు కల్పించడంలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటుందని,సంస్థ అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని కోల్ ఇండియా పోటీలలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆర్.జి-3ఏరియా జనరల్ మేనేజర్ ఐత మనోహర్ కార్మికులకు పిలుపునిచ్చారు.గురువారం సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలోని సి.ఈ.ఆర్ క్లబ్ లో కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్,వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలకు జి.యం. మనోహర్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులందరు ఐకమత్యంగా పనిచేస్తూ, సింగరేణి నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేసుకుని సంస్థ మనుగడలో భాగస్వాములు కావాలన్నారు. ఈ పోటీలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న పదకొండు ఏరియాల క్రీడాకారులు పాల్గొంటున్నారు.
గురు, శుక్రవారాల్లో నిర్వహించబడేఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎన్నుకోబడతారు. ఈ కార్యక్రమములో అధికారుల సంఘం నాయకులు నరేందర్, కార్మికసంఘం నాయకులు గౌతం శంకరయ్య, ఎస్.ఓ.టు జి.యం.రఘుపతి, ఓ.సి-1 ప్రాజెక్ట్ ఆఫీసర్ రాధాకృష్ణ,డి.జి.ఎం (పర్సనల్) విలాస్ శ్రీనివాస్ పోతేదార్, కావూరిమారుతి, క్రీడా గౌరవ కార్యదర్శి నాగేశ్వరరావు, కర్ణ, స్పోర్ట్స్ సూపర్ వైజర్స్ పర్స శ్రీనివాస్, జాన్ వెస్లీ, సమన్వయకర్త బూస వెంకటేశ్వర్లు, సీనియర్ క్రీడాకారులు ముకేష్ కుమార్, చంద్రపాల్, గంధం శ్రీనివాస్, ప్రసాద్, హఫీజ్, శేషగిరి, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్, శంకర్, రాయమల్లుతోపాటు సింగరేణి పదకొండు ఏరియాల క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply