సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు

Share this:

మునుగోడు(V3News): మునుగోడు నియోజకవర్గం ఆరు మండలాల ఫీల్డ్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు, వారికి పుట్టింటి సారెగా తన సొంత నిధులతో పట్టు చీరలు బహూకరించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా TRS కార్మిక విభాగం అధ్యక్షులు పలు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ: అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణను చూసి ఓర్వలేకే కొంతమంది కావాలని కుట్రపన్నారని తెలంగాణ, ఆంధ్రా లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల సమస్య ఉన్న కేవలం తెలంగాణలోనే కొంత మంది స్వార్థపూరితమైన రాజకీయాలతో ధర్నాలు చేయించారని దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధర్నాలు వద్దు దరఖాస్తు ముద్దు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ముందు చూపు తో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలు అవుతున్నాయన్నారు

Leave a Reply