సీఎం కేసీఆర్ ప్రసంగం లోని ముఖ్యాంశాలు

Share this:

సీఎం కేసీఆర్ ప్రసంగం లోని ముఖ్యాంశాలు

  • అవినీతికి పోయే వికెట్లుతెలంగాణ మంత్రివర్గంలో లేవు.
  • అనాలోచితమైన ఆలోచనలు దేశంలో అమలు అవుతున్నాయి.
  • అందుబాటులో ఉన్న విద్యుత్ ను కేంద్రం ఉపయోగించుకోవడం లేదు.
  • దేశంలో నీటి యుద్ధాలు జరగటానికి కారణం ఎవరు?
  • దేశం ఉజ్వలమైన భవిష్యత్ కోసం మన పాత్ర పోషించాలి.
  • తెలంగాణ ప్రజలకు టీఆరెస్ పార్టీ కాపలా దారు.
  • తెలంగాణ ప్రజల ఆస్తి టీఆరెస్ పార్టీ.
  • ఎవరూ పెట్టని కోట టీఆరెస్ పార్టీ.
  • దేశానికే ఒక రోల్ మోడల్ గా తెలంగాణ పాలన సాగుతోంది.
  • తెలంగాణ అభివృద్ధి కేంద్రం ఇచ్చే అవార్డులు చూస్తేనే అర్థం అవుతుంది.
  • 10కి పది గ్రామాలు కేంద్రం పరిశీలనలో ఉత్తమమైన గ్రామాలు ఎన్నికైనవి.
  • కుటిల రాజకీయాలు చేయడం చాలా సులువు.
  • పదవుల కోసం ఏమైనా చేస్తారా?
  • కుటిల బుద్ధితో దేశాన్ని కూలగొట్టడం ఈజీ- కానీ నిలబెట్టడం కష్టం.
  • హిజాబ్ ,హలాల్ అంశాలతో కర్ణాటక అట్టుడుకుతోంది
  • సిలికాన్ వ్యాలీ లో 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు. మత విద్వేషాలు పెరిగితే వారి పరిస్థితి ఎం కావాలి
  • విదేశాల్లో ఉన్న 13 కోట్ల మన వాళ్ళను ఆ దేశాలు వెల్లగొడితే ఈ దేశం సాదుతుందా?
  • దేశం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతోంది.
  • సమసిపోయిన గాయాల పై కారం చల్లుతున్నారు
  • మత పిచ్చితో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
  • పిచ్చి కొట్లాటలు పెట్టి దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు
  • *మతపరమైన ఊరేగింపుల్లో కత్తులు- తుపాకులు పట్టుకొని ఏం చెప్పదలచుకున్నారు?
  • మతం- కులం పేరుతో విద్వేషాలా ?జనాలు పొడుచుకొని చావాలా?
  • దేశంలో కుటిల రాజకీయం చేస్తున్నారు-టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్
  • ఢిల్లీ గద్దెనెక్కాల్సింది ప్రజలు- పార్టీలు కాదు!.
  • ఎవరినో గద్దె దించడానికో- ఎక్కించడానికే కూటములు పెట్టొద్దు.
  • రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావు.ప్రత్యామ్నాయ ఎజెండా రావాలి
  • డొల్ల ‘కల్లి బొల్లి మాటలు కావు- దేశాన్ని అభివృద్ధి చేసే ఎజెండా కావాలి.
  • ప్రత్యామ్నాయ గుంపు కాదు- కూటమి కాదు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి.
  • ఎల్లయ్య ను మల్లయ్య ను ప్రధాని చేయడానికి కాదు మనకు.
    [ గవర్నర్ల వ్యవస్థ సరిగ్గా లేదు- సీఎం కేసీఆర్]
  • మహారాష్ట్ర నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ లో పెట్టుకున్నారు- కేసీఆర్
  • బెంగాల్- మహారాష్ట్ర తో పాటు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారు
  • ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మరిచిపోవద్దు.
  • ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన గవర్నర్ …అవమానపడి వెళ్లిపోయారు.
  • మృగాళ్లలాగ కత్తులతో రాజకీయం చేస్తున్నారు.
    *కావాల్సింది కత్తులు కాదు పొలాలకు సాగు నీళ్లు రావాలి
  • అంబెడ్కర్ ఆశయం కోసం కొత్త రాజకీయ శక్తి అవిర్భవించాలి.
  • దేశం కోసం టీఆరెస్ ఉజ్వలమైన పాత్ర వహిస్తుంది.
  • తెలంగాణ కోసం టీఆరెస్ పుట్టినట్లే దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుంది.
  • తెలంగాణ తరహాలోనే భూకంపం పుట్టించి- విద్రోహ శక్తులను తరిమికొడుదాం.

Leave a Reply