స్థానిక సంస్థల ఎన్నికల ఉల్లంఘనలపై చర్యలు

Share this:

విజయవాడ:- శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఒక రోజు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశం ..రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో మార్చి 8 వతేదీన స్థానిక శాసన సభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీ పరిధిలో చీరలు, బట్టలు పంచిపెట్టినట్లు ఫీర్యాదు రావడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ తెలిపారు.

ఈ సంఘటన పై ఎన్నికల సాధారణ పరిశీలకులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తాడిపత్రి మునిసిపాలిటీ లోని శ్రీరాముల పేటలో వాకబు చేసి, వాస్తవాలను నిర్ధారించడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి రాష్ట్రంలో 7వ తెది నుండి అమల్లోకి వచ్చినందున , ఓటర్లు ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయ్యడం తీవ్రంగా పరిగణించడ మైనదని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కింద ప్రాసిక్యూషన్ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డి మార్చి 15 న ఒక రోజు ఎన్నికల ప్రచారం లో పాల్గొనకుడదని ఉత్తర్వులు జారీ చేశామన్నారు.


Leave a Reply