స్వచ్ఛందంగా ముందుకు వ చ్చి కరోనా టెస్టింగ్ చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

Share this:

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కరోనా వైరస్ నిర్ధారణ కోసం తన శాంపిల్ ను టెస్టింగ్ చేయించుకోగా ఫలితం నెగిటివ్ గా వచ్చింది.. ఈ విషయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ తెలియచేశారు.. అనుమానంగా ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ శాంపిల్స్ ను ఇచ్చి పరీక్ష చేయించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని, అలాగే చిన్న తనంగా కూడా భావించాల్సి అవసరం లేదని, ధైర్యంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. తమ కుటుంబంతో పాటు ఇతరులకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా ప్రతి కరోనా పరీక్షలు చేయించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు.


Leave a Reply