స్వచ్ఛభారత్ సృష్టికర్త  సాంఘిక సంస్కర్త  సంత్ గాడ్గేబాబా.

Share this:

స్వచ్ఛభారత్ సృష్టికర్త సాంఘిక సంస్కర్త సంత్ గాడ్గేబాబా 65 వ వర్ధంతి కార్యక్రమాన్ని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అధ్యక్షతన కర్నూలు నందలి బి క్యాంపులోని ఐక్య వేదిక జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.  మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి గాడ్గేబాబా చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విషయాలను బోధించడం కీర్తనలు పాడటమే కాకుండా సాంఘిక సమస్యలపై పోరాడుతూ కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మహనీయులు సంత్ గాడ్గేబాబా అని ఆమె అన్నారు. గాడ్గేబాబా అసలు పేరు దేవిదాస్ దేబూజీ అని వారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో  షేన్గావ్ గ్రామంలో 1876 ఫిబ్రవరి 23 న రజక కుటుంబంలో జన్మించారని ఆమె తెలిపారు.  సమాజములోని మూఢత్వము వెనుకబాటుతనం పోగొట్టడానికి విద్య ఒక్కటే ఆయుధం అని నమ్మిన గాడ్గేబాబా తన భక్తులు ఇచ్చిన విరాళాలతో 150 పాఠశాలను, విద్యార్థుల వసతిగృహాలను,   అనాధశరణాలయాలను ధర్మశాలలను, గోశాలలను, సేవాశాలలను నిర్మించినారని ఆమె అన్నారు. కులవివక్షత పై పోరాటం చేస్తూనే మద్యపానం ధూమపానం జూదం వంటి వ్యసనాలకు, మరియు జంతుబలులకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ నిరంతరం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త సంత్ గాడ్గేబాబా అని ఆమె తెలిపారు. గ్రామాలలో పర్యటిస్తూ పరిశుభ్రతకై చీపురుదండు అనే సంస్థను స్థాపించి ఎంతో మందిని స్వచ్ఛభారత్ లో భాగస్వాములను చేసిన ఘనత గాడ్గేబాబాదేనని ఆమె అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అభిమానిస్తూ, వారిని అనుసరిస్తూ జీవించిన గాడ్గేబాబా అంబేద్కర్ మరణాన్ని తట్టుకోలేక బాబా సాహెబ్ మరణించిన పదనాలుగు రోజులకే గాడ్గేబాబా కూడా మరణించారని ఆమె తెలిపారు. యస్సీ యస్టీ బిసి మైనార్టీ వర్గాలు అయిన మనము గాడ్గేబాబా ఆలోచనా విధానంతో ముందుకు వెళ్ళాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ, ఎర్రం లక్ష్మిదేవి, శార,శారద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply