హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఇద్దరు అరెస్టు

Share this:

తాడికొండ (V3 News): రాష్ట్ర హైకోర్టులో క్లర్కు ఉద్యోగాలు ఉన్నాయని నకిలీ కాల్ లెటర్స్ సృష్టించి మోసం చేస్తున్న వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన యల్లా ఉమామహేశ్వరరావు, పోనంగి సత్యసాయి చక్రధర్, మరి కొందరు కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తున్నారు. నకిలీ నోట్లు తయారుచేసి నిరుద్యోగులకు చూపించి డబ్బు వసూలు చేస్తున్నారు. కాల్ లెటర్స్ ప్రజల్లో సర్క్యులేట్ అవుతుండడంతో గుర్తించిన హైకోర్టు డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ కె.ఎస్.వి ప్రసాద్ రావు గతనెల 16న తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు డిఎస్పి వి.పోతురాజు ఆదేశాల మేరకు దుర్గాప్రసాద్ విచారించి ఉమామహేశ్వరరావు, పోనంగి సత్యసాయి చక్రధర్ లను శుక్రవారం మందడం గ్రామ శివార్లలో అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు.

Leave a Reply