రాష్ట్రంలో దళిత భంధు నూటికి నూరుశాతం అమలు చేసిన జిల్లా సంగారెడ్డి – రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

Share this:

పటాన్ చెరు(V3News) 01-04-2022: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని మైత్రి గ్రౌండ్స్ లో దళితభంధు పధకాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతి ప్రధాత కేసీఆర్ చిత్రపటానికి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ,మెదక్ శాసనమండలి సభ్యులు యాదవ రెడ్డి శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టరు హన్మంతరావు SP రమణ కుమార్‌ లతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ‌. దళిత భందుపంపిణీ పథకం రాష్ట్రం లోనే ముందు సంగారెడ్డి జిల్లాలో 100% అమలు చేసినందుకు కలెక్టర్ హనుమంతు రావును ఆయన అభినందించారు . దళిత బంధుపథకం ఒక సామాజిక ఉద్యమమన్నారు. పటాన్ చెరు లో 100 యూనిట్లు ఒకే సారి దళిత భందు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఏమి చేయలేదని భారతీయ జనతాపార్టీ భారతీయ పెద్ద జూట పార్టీయని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్ లో వారానికి ఒక రోజు పవర్ హాలిడే ఉందని తెలంగాణ లో 24 గంటల కరెంట్ సరఫరా చేయటం జరుగుతుందని వివరించారు. 1200 కోట్లు ఖర్చు పెట్టి కరెంట్ కొంటున్నామని, ప్రజల కు ఇబ్బందులు లేకుండా చేసామని తెలిపారు. దళిత బందు పథకం లబ్దిదారులకు నేడు నిజమయిన ఉగాది ఒక రోజు ముందు గానే వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

👉రాష్టం లో దళిత బందుపంపిణీ పథకం రాష్ట్రంలో లోనే ముందు సంగారెడ్డి జిల్లాలో 100% అమలు చేసినందుకు కలెక్టర్ గార్కి ధన్యవాదాలు

👉 ప్రభుత్వ వైద్య పథకాల్లో కాంట్రాక్టు లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం

👉 దళిత బందుపథకం సామాజిక ఉద్యమం

👉 పఠాన్ చేరు లో 100 యూనిట్లు ఒకే సారి దళిత బందు ప్రారంభించడం సంతోషం

👉 కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఏమి చేయలేదని భారతీయ జనతాపార్టీ భారతీయ జూట పార్టీ వెల్లడించిన మంత్రి హరీష్ రావు

👉 నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్ లో వారానికి ఒక రోజు పవర్ హాలిడే మన దగ్గర 24 గంటల కరెంట్ సరఫరా

👉 1200 కోట్లు ఖర్చు పెట్టి కరెంట్ కొన్నాం ప్రజల కు ఇబ్బందులు లేకుండా చేసాం

👉 దళిత బందు పథకం లబ్దిదారులకు శుభాకాంక్షలు నిజం అయిన ఉగాది ఒక రోజు ముందు వచ్చింది

Leave a Reply