కోటి బతుకమ్మ చీరలు మరియు పాత పెన్షన్ దారులకు కార్డులు పంపిణీ చేసిన-ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు

Share this:

యలాల మండలం మొత్తం 12094 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఇంట్లో పెద్దకొడుకుగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు యాలాల్ మండల కేంద్రము తో పాటు మండల పరిధిలోని సంగెం ఖుర్థు, చెన్నారం, పగిడిపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలు మరియు పాత పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ 24 విభిన్న డిజైన్లు ,10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో చేనేత కార్మికులు నేచిన చీరలు,92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా వయోవృద్ధ మహిళలు ధరించే విధంగా 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షల చీరలు.రూ. 339.73 కోట్ల ఖర్చు ఈ కోటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందన్నారు.పండగపుట ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని బతుకమ్మ , రంజాన్, క్రిస్మస్ పండుగ లకి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ముస్లిం సోదరీమణులకు రంజాన్ కిట్లు (తోఫా ),క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కిట్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసీఆర్ గారితో సాధ్యం అయితుందని చెప్పారు. పల్లె ప్రగతి పేరుతో ప్రతి నెల గ్రామపంచాయతీలకు నిధులు ఇచ్చి సిసి రోడ్లు మరియు డంపింగ్ యార్డులు పల్లె ప్రకృతి వనాలు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణాలకు దీటుగా పల్లెల్ని తీర్చిదిద్దిన ఘనత తెరాస ప్రభుత్వం అనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ రాజు గౌడ్ ఎంపీపీ బాలేశ్వర గుప్తా వైస్ ఎంపీపీ రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి జిల్లా కోఆప్షన్ మెంబర్ అక్బర్ బాబా యాలాల మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సర్పంచ్ చిద్రాల సులోచన, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.