సీఎం కెసిఆర్ స్ఫూర్తితో నిరుపేద‌ల‌ను ఆదుకోవాలి : ఎమ్మెల్సీ పోచంప‌ల్లి

Share this:

వ‌రంగ‌ల్, V3 న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎం కెసిఆర్ స్ఫూర్తిగా దాత‌లు ముందుకు వ‌చ్చి, నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌ని శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 20వేల మంది నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయాల‌ని సంక‌ల్పించిన ప్ర‌భుత్వ చీఫ్ విప్, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే దాస్యం విన‌య భాస్క‌ర్ ఆధ్వ‌ర్యంలో గురువారం వ‌రంగ‌ల్ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గం‌లోని 46, 47, 48వ డివిజన్లలో నిరుపేద కుటుంబాలకు శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేశారు.

Leave a Reply