మైనింగ్ మాఫియా డాన్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయాలి

Share this:

కొత్తకోట, V3 న్యూస్ : మైనింగ్ మాఫియా డాన్ శ్రీకాంత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించామని, అనంతరం ఆర్డీఓ, సర్పంచ్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారని తెలిపారు, ఇసుకను అక్రమంగా దాచిన దొంగలను తేల్చకుండా, ప్రజా ప్రయోజనాల పేరుతో తరలించడం అన్యాయమని, వెంటనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply