పోచారం ట్రస్ట్ నిత్యావసర సరుకుల పంపిణీ

Share this:

బాన్సువాడ, V3 న్యూస్ : కరోనా మహమ్మారి నివారణకు విధించిన లాక్ డౌన్ నేపధ్యంలో విధులు నిర్వహిస్తున్న వారిని ఆదుకోవడానికి పోచారం ట్రస్ట్ ద్వారా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పోలీసు సిబ్బంది, ఆశా వర్కర్లు, హస్పిటల్ సిబ్బంది, జర్నలిస్టులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్‌లు, పారిశుద్ధ్య కార్మికులకు పోచారం ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, మందు లేని మహమ్మారి కరోనా జబ్బు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి మందు అని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply