24 వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్

Share this:

24 వ డివిజన్లో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని బల్దియా డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ అధికారులను మంగళవారం ఆదేశించారు.
బల్దియా డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,స్థానిక కార్పొరేటర్ ఆకుతోట రామ తేజస్వి శిరీష్ లతో కలిసి బల్దియా పరిధి లోని 24 వ డివిజన్ లోని పాపయ్య పేట చమాన్,ఎల్లం బజార్,పంచతన్ కాలేజీ,వెంకటేశ్వర స్వామి టెంపుల్,షేర్ పురా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి 24 వ డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న రోడ్ల ప్యాచ్ (ఆతుకుల పనులు),పెండింగ్ లో ఉన్న డ్రైనేజి పనులు,ప్రతిరోజూ మంచినీరు సరఫరా,నీటి లీకేజీలు అరికట్టేలా చర్యలు చేపట్టాలని,శానిటేషన్ పక్కడ్బందీగా నిర్వహించాలని అధికారులను,సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తెరాస నేతలు దాచేపల్లి సీతారాం,తోట హరీష్,సద్దాం,సానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య,సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్,జవాన్ రవి,వర్క్ ఇన్స్పెక్టర్,సీవోలు ఆర్.పి లు,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply