286 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలు ధ్వంసం

Share this:

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో “ఆపరేషన్ పరివర్తన” కార్యక్రమంలో భాగంగా తేది.25.11.2021.గూడెంకొత్తవీధి మండలం, మొండిగెడ్డ పంచాయతీ, కొండపల్లి, తోటలగొంది, కోటకొండ, గింజంగి, వనాబలింగం గ్రామాలలో 136 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.. దుప్పిలవాడ పంచాయతీ, జి.నేరేడుపల్లి, ఎస్.నేరేడుపల్లి, రామాపురం, హరిపురం, కాట్రగెడ్డ, పిల్లిగెడ్డ గ్రామాల్లో 118 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం, ఆర్మ పంచాయతీ జుర్రుపాడు, సిండిపుట్టు, పిత్తగూడ, నక్కలపుట్టు గ్రామాలలో మొత్తం 32 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు.విశాఖపట్నం జిల్లాలో ఈరోజు మొత్తం 286 ఎకరాల్లో ఉన్న గంజాయిని జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి శ్రీ ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్., వారి ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి ఇతర శాఖల అధికారుల సమన్వయంతో , సి.ఐ., జి.కె.వీధి, జి.అశోక్ కుమార్, తదితరులు గంజాయి ధ్వంసంలో పాల్గొన్నారు.

Leave a Reply