సూర్యాపేట జిల్లాలో 325 కేజీల భారీగా గంజాయి పట్టివేత

Share this:

జిల్లాలో 325 కేజీల భారీగా గంజాయి పట్టుకున్నారు ఈ మేరకు ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

నేరెడ్ చర్ల పోలీస్ స్టేషన్ పరిధి చిల్లకల్లు బ్రిడ్జి వద్ద వాహనాల తనఖీల్లో భాగంగా 85 కేజీల గంజాయి పట్టుబడింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు 85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోనుగోడు గ్రామం వద్ద పోలీసులు వాహనలు తనిఖీ చేస్తుండగా 240 కేజీల గంజాయిని సీజ్ చేశారు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

మొత్తం జిల్లాలో ఒకేరోజు 325 కేజీల గంజాయి సీజ్ చేశారు
ఇందులో భాగంగా రెండు కార్లు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు సందీప్ కుమార్ జాన్ బాబా భాస్కర్ ,పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు

ఈ సందర్భంగా గంజ సీజ్ లో బాగా పనిచేసిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్యాష్ రివార్డుతో అభినందించారు.ఈ సమావేశంలో డిఎస్పీ, సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply