6ఎర్రచందనం దుంగలతో పాటు ఇద్దరు స్మగ్లర్లుఅరెస్ట్ వాహనం స్వాధీనం

Share this:

శేషాచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం దుంగలను నరికి రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కడపజిల్లా రాజంపేట నియోజకవర్గం సానిపాయి రేంజర్ పీరయ్య తెలిపారు .రాజంపేట డీఎఫ్వో వెంకట నరసింహ రావు ఆదేశాల మేరకు గురువారం ఉదయం 7.గంటలకు పించా సెక్షన్ పరిధిలో దిన్నెల బీటు ప్రాంతంలో ఏనుంగుడ్డు కొరవ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగ పొదల చాటున కొందరు తమిళ కూలీలు కారులోకి ఎర్రచందనం దుంగలను లోడు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారిలో తమిళనాడుకు చెందిన . సేలంబరసన్ ,శివరాజ్ అనే ఇద్దరు ముద్దయిలు ను అరెస్ట్ చేసివారి వద్ద నుండి 6ఎర్రచందనం దుంగల్నీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న 6దుంగలు 89 కేజీలు లు వాటి విలువ 37711 రూపాయలు గా అలాగే AP39AP9298 నంబర్ అలాగే టయోటా ఇటియోస్ కారును సీజ్ చేశామని తెలిపారు .మరికొందరు పారిపోయినట్లు రై౦జర్ పీరయ్య తెలిపారు ఈ కుంబింగ్లోఎఫ్ఎస్వో .రమణ ఎఫ్బి ఓ లు సునీర్ బాషా, . దేవేంద్ర రెడ్డి ,మరియు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply