8.35 కోట్ల నిధులతో ముచ్చర్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Share this:

వర్ధన్నపేట(V3News): గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు.వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు నుండి ముచ్చెర్ల వరకు 8 కోట్ల నిధులతో చేపట్టనున్న డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణానికి,ముచ్చెర్ల ప్రభుత్వ పాఠశాలలో 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ బుధవారం శంకుస్థాపనలు చేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన గుడికందుల రాకేష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 75వేల రూపాయల చెక్కును లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు మరియు విలీన గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.అనంతరం ముచ్చర్ల క్రాస్ నుండి ముచ్చర్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ వరగంటి అరుణ కుమారి,బీజేపీ నాయకులు అనిల్ కుమార్,మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు,చల్లా వెంకటేశ్వర రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షుడు సూర ప్రమోద్,టీఆరెస్ రాష్ట్ర నాయకులు సుందర్ రాజ్,గనిపాక కల్పన విజయ్ కుమార్,డైరెక్టర్ చిర్ర రాజు,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్,డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్,ప్రధాన కార్యదర్శి శ్రావణ్,ముచ్చర్ల స్థానిక తెరాస నాయకులు గండన్న,వడ్లకొండ రమేష్,హెడ్మాస్టర్ రంగనాథ్, కాంట్రాక్టర్లు శివ,అశోక్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply