అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం…ఎమ్మెల్యే చల్లా

Share this:

పరకాల(v3News) 29-08-2022: రాష్ట్రంలో అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తామని సాంకేతిక కారణాల వలన పెన్షన్లు మంజూరు కానీ వారు ఆందోళన చెందవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం నియోజకవర్గంలోని నడికూడ మండలం వరికోల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,సర్పంచులు,ఎంపిటిసిలు,మార్కెట్ చైర్మన్& కమిటీ సభ్యులు,రైతుబంధు సమీతీ కన్వీనర్లు,సొసైటీ చైర్మన్లు& కమిటీ సభ్యులు,మండల అధికారులు, తెరాస నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.