సరూర్ నగర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఆసరా పెన్షన్ పంపిణి

Share this:

సరూర్ నగర్(V3news) 21-09-2022: తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను చెరుకు తోట కాలనీ కమ్యూనిటీ హాల్ లో లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అందరికీ పెన్షన్ కార్డులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అర్హులైన వాళ్లందరికీ ఆసరా పెన్షన్స్, వితంతువులకు, ఒంటరి స్త్రీలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, వికలాంగులకు, వృద్ధులకు, డయాలసిస్ పేషెంట్లకు నూతనంగా పెన్షన్ ఇవ్వడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా,యెగ్గే మల్లేశం,మహేశ్వరం టి.ఆర్.ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్ రెడ్డి,సరూర్ నగర్ డివిజన్ టి. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ యాదవ్,బేర బాలకిషన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు