అక్రమాస్తుల కేసులో భైంసా తహసీల్దార్ నరేందర్ అరెస్టు

Share this:

భైంసా నిర్మల్ జిల్లా భైంసా తహసీల్దార్ ఎర్రా నరేందర్ పై అసమాన ఆస్తుల కేసు నమోదు అయ్యింది. బుధవారం కరీంనగర్ ఏసీబీ అధికారులు సంబంధిత కేసు నమోదు చేసి భైంసా తహసీల్దార్ ఎర్రా నరేందర్ ను ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్ లోని ఎస్పీఈ ఏసీబీ కేసుల ప్రత్యేక జడ్జీ ముందు హజరుపరిచారు. తహసీల్దార్ ఏర్రా నరేందర్ తన సర్వీసు సమయంలో అవినీతి పద్ధతులు, సందేహస్పద మార్గాల్లో మునిగి తన ఆదాయ వనరులకు అసమానమైన ఆస్తులను కూడపెట్టుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం కరీంనగర్ ఏసీబీ అధికారులు నిర్మల్లోని తహసీల్దార్ ఏర్రా నరేందరు సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించగా రూ.1,16,28,314 పైగా విలువైన స్థిర, చర ఆస్తులను, రూ.1.32 లక్షల నికర నగదును గుర్తించారు. ఇంకా అధనపు ఆస్తుల వెరిఫికేషన్ కోసం ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి తోడు 2021 సంవత్సరములో ఒక వీఅర్ఏ పై అవినీతి కేసు నమోదు చేయబడింది. అయితే సంబంధిత కేసులో అప్పుడు ఖానాపూర్ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ఏర్రా నరేందర్ ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంబంధిత కేసుపై సైతం ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిసింది.

Leave a Reply