అమరావతి ఏకైక రాజధాని- అమరావతి రైతుల మహా పాదయాత్ర

Share this:

కృష్ణాజిల్లా , మచిలీపట్నం(V3News) 22-09-2022: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర బందరు మండలం చిన్నాపురం నుండి ప్రారంభమైంది. అమరావతి రైతులకు ఈ ప్రాంత ప్రజలు, రైతులు సంఘీభావం తెలిపారు.మచిలీపట్నం 9వ వార్డు మాజీ కౌన్సిలర్, ఆదర్శ రైతు కొట్టె వెంకట్రావ్ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు చిన్నాపురం గ్రామానికి వెళ్లి అమరావతి రైతులకు తమ మద్దతు తెలిపారు.”మాది మచిలీపట్నం.. అమరావతే మా రాజధాని” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులు త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చారని , అమరావతి రైతులు చేస్తున్న ఈ పాదయాత్రకు పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలని అన్నారు.