కేతపల్లి మండలం, తుంగతుర్తి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఘన నివాళులర్పించిన-నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

Share this:

  • తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్
  • బి. సి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య

కేతపల్లి(V3News) 23-04-2022: కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గురువారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమనికి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మరియు బి. సి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పూజర్ల శంభయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా వారికి 500 వందల బైక్ ర్యాలీ,కోలాటం మరియు డప్పుచప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు విగ్రహని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేడ్కర్ గారు అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు తనకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగొద్దని దేశ న్యాయ మంత్రి అయ్యాక‌ ద‌ళితుల‌కు రిజ‌ర్వేషన్ల‌ను క‌ల్పించింది కూడా అంబేద్క‌రే మ‌న దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని రాసి చరిత్రలో నిలిచిపోయారు అంబేడ్కర్ గారు ఈ రోజు మ‌నం ఈ ప్ర‌జాస్వామ్యాన్ని అనుభ‌విస్తున్న‌మంటే ఆ పుణ్యం అంబేద్క‌ర్ దే అలాంటి మహోన్నతుడిని గుర్తు చేసుకుంటూ… ఈ రోజు ఆయ‌న విగ్రహాం ఆవిష్కరించుకోవడం చాల సంతోషమని, ఆయన ఆశయ సాధనకు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు… అనంతరం అన్నదాన కార్యక్రమాని వేముల వీరేశం సాయి చందు బిక్షం వెంకన్న సతీష్ సుధాకర్ కిషోర్ ప్రారంభించారు

Leave a Reply