అంబేద్కర్ అందరివాడు…….

Share this:

చాగలమర్రి(V3News ) 15-04-2022:నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, బడుగు బలహీన వర్గాలఆశాజ్యోతి,బహుముఖ ప్రజ్ఞాశాలి,న్యాయ కోవిదుడు,సుదీర్ఘ పోరాట యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని ఎస్ఐ రమణయ్య పేర్కొన్నారు. గురువారం అంబేద్కర్ 131 వ జయంతిని మాల మహాసేన, ఎమ్మార్పీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలపాడు బస్టాండ్ నుండి పెద్దమ కా నం , గాంధీ సెంటర్ మీదుగా, మల్లె వేముల బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం, ఎస్సై తో పాటు కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో ఎస్ఐ రమణయ్య అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాలను, రాజ్యాంగ విషయాలను, భారతీయ చట్టాలు, పలు అంశాలపై తెలియజేశారు. అనంతరం మాల మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు కడియం సాంబశివుడు, మాల మహాసేన మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు రోజక్క ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తి ఓబులేసు, బీసీ సంఘం నాయకులు రామతీర్థం, పీరయ్య, షెడ్యూలు కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ బ్రహ్మం, ఉద్యోగ సంఘాల నాయకులు తిరుపతయ్య, ఎం.ఈ.ఎఫ్. తాలూకా ప్రధాన కార్యదర్శి ఘన మద్దిలేటి, ఏపీ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షులు నెమల్లదిన్నె మద్దిలేటి, ఎస్సీ సెల్ నాయకులు టి.ఎన్.ఎల్ పుల్లయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు గోపాల్, గడ్డ ప్రకాష్,అంజయ్య, మాల మహాసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, మండల అధ్యక్షులు జి భాస్కర్, లూకా ప్రసాద్, ఆనందరాజు, సంజీవ రాయుడు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బెన్నయ్య, ప్రభు కాంత్, నల్లమల ఓబులేసు , బీసీ సంఘం నాయకులు నాగరాజు యాదవులు తదితరులు ప్రసంగించారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ చంద్రకళ, సి ఐ టి యు అనుబంధ సంస్థ హమాలి యూనియన్ అధ్యక్షులు నరసింహుడు, మాల మహాసేన ఆళ్లగడ్డ తాలూకా కన్వీనర్ గుర్రం ప్రభాకర్, MRPSజిల్లాకార్యదర్శి R వేణుగోపాల్,. M S F మండల అధ్యక్షులు D .రామాంజనేయులు వివిధ గ్రామాల దళిత నాయకులు చాగలమరి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply