అభివృద్ధిపై చర్చకు సిద్ధమే – కౌన్సిలర్ వంశీ
ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై టిడిపి నాయకుల చర్చను సవాల్ చేస్తూ, తాము ఎప్పుడైనా అభివృద్ధిపై చర్చలకు సిద్ధమే అని 32వ వార్డు వైసీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తమ నాయకుడు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ఉంటేనే రానున్న ఎన్నికలలో తమకు, తమ పార్టీకి ఓటు వేయాలని ఆయన సవాల్ విసిరారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్కుకు, జగనన్న కాలనీలు, మంచినీరు, రోడ్లు, కాలువలు, పెన్నా నదిపై బ్రిడ్జి, వైవియు నందు భవనాలు, నూతన మార్కెట్ నిర్మిస్తుంటే, టిడిపి నాయకులు తమ ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు తమ వార్డులోని సమస్యలు తెలిపితే 15 రోజుల లోపల పనులు మొదలు పెడతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ నాయకుడు ఎమ్మెల్యే రాచమల్లు వేల కోట్ల రూపాయల సంపాదించారని టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.