లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం సందర్భంగా కుప్పంలోని దేవస్థానంలో 101 కొబ్బరికాయలు కొట్టిన తెలుగు తమ్ముళ్లు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో కుప్పం మునిసిపల్ పరిధిలోని లక్ష్మిపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం వద్ద టీడీపీ, జనసేన నేతలు 101 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి సురేష్ బాబు మరియు నాయకులు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. యువగళం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ ఎక్కడ వెనుకడుగు వేయకుండా, పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్నారని పేర్కొన్నారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు కాణిపాకం వెంకటేష్, కన్నన్, నరేష్, రవి, ఉమాపతి, సోము మరియు టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.