అనంతపురం లో 5 వేల మైలురాయి దాటిన CHAT BOT మొబైల్ ఫోన్ల రికవరీ

ఇప్పటి వరకు రూ. 8.25 కోట్ల విలువ చేసే 5077 మొబైల్ ఫోన్లు అందజేత

 • 15 ఇతర రాష్ట్రాల ప్రజలకు మరియు మన రాష్ట్రంలోని 18 జిల్లాల ప్రజలకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేయడం పట్ల సర్వత్రా హర్షం
 • ఇతర రాష్ట్రాల/జిల్లాల ప్రజల కోసం ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో “ఉచిత డోర్ డెలివరీ” కార్యక్రమం ప్రారంభం

— జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు

 • CHAT BOT సేవలు ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఇప్పటి వరకు రూ. 8.25 కోట్లు విలువ చేసే 5077 మొబైల్ ఫోన్లు రికవరీ
 • ఈరోజు 700 మొబైల్ ఫోన్లను అందజేసిన జిల్లా ఎస్పీ… మిగితావి ఇదివరకే పంపిణీ చేసిన జిల్లా పోలీస్
 • మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన అనంతపురం జిల్లా పోలీస్
 • ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను భారీగా రికవరీ చేసి ముట్టజెప్పతుండటంతో బాధితుల్లో వ్యక్తమవుతున్న హర్షం
 • భారీ స్థాయిలో రికవరీ చేసి బాధితులకు ముట్టజెప్పడంలో శ్రమించిన జిల్లా పోలీస్ టెక్నికల్ విభాగాన్ని అభినందించిన గౌరవ రాష్ట్ర డి.జి.పి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS గారు
 • పోలీసు స్టేషన్లకు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ముట్టజెప్పాలనే సంకల్పంతో గత మార్చి 17 న ప్రారంభించిన వాట్సాప్ 9440796812 సేవలు … మరింత ప్రజలకు సులువైన సేవలు అందించడానికి గత జూన్ 26 న CHAT BOT సేవలు ప్రారంభం

** సరికొత్తగా “ఉచిత డోర్ డెలివరీ ” ప్రారంభం… ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారం

 • ఇతర రాష్ట్రాల, జిల్లాల బాధిత ప్రజల ఇంటికి వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఫ్రీగా చేర్చేందుకు సరికొత్తగా ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో ” ఉచిత డోర్ డెలివరీ” కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు
 • సుదూర ప్రాంతాల నుండీ ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు తీసికెళ్లాలంటే వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో బాధితులకు నేరుగా ఇళ్లకు పంపేలా శ్రీకారం చుట్టామని ఎస్పీ వెల్లడి

** 15 రాష్ట్రాల బాధిత ప్రజలకు రికవరీ చేసి అందించిన మొబైల్ ఫోన్లు

ఇతర రాష్ట్రాలైన కర్నాటక- 178, తెలంగాణ -117, కేరళ-31, మహరాష్ట్ర – 23, తమిళనాడు-17, ఒడిస్సా- 06.. ఉత్తరప్రదేశ్ – 06, డిల్లీ- 05, భీహార్ -04, మధ్యప్రదేశ్ – 04, రాజస్థాన్ – 03, పంజాబ్ -02, పశ్చిమ బెంగాల్ – 02, గోవా, హర్యానా రాష్ట్రాల నుండీ చెరో ఒక సెల్ ఫోన్ ప్రకారం మొత్తం 400 రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పారు.

** మన రాష్ట్రంలోని 18 జిల్లాల బాధిత ప్రజలకు రికవరీ చేసి అందించిన ఫోన్లు

 ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా- 2951, SSS జిల్లా- 797, కర్నూలు- 436, కడప - 133, చిత్తూరు- 88, నెల్లూరు- 46, తూర్పు గోదావరి-45, గుంటూరు- 41, ప్రకాశం-31, తిరుపతి- 31, పశ్చిమ గోదావరి- 23, కృష్ణి-16, విశాఖపట్నం-16, శ్రీకాకుళం-07, విజయవాడ-06, విజయనగరం-06, కాకినాడ-03, ఏలూరు- 01 ... మొత్తం 5077 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశారు. వీటి మొత్థం విలువ సుమారు రూ. 8.25 కోట్లు ఉంటుంది