కాసుల చిత్రకళ అకాడమీ పురస్కారం అందుకున్న పెద్దింటి రామం అభినందించిన సత్యానందరావు

అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ పురోహితులు పెద్దింటి రామం రిపబ్లిక్ డే సందర్భంగా 5లక్షల బియ్యపు గింజలపై 5లక్షల జాతీయ జెండాలను చిత్రీకరించి హైదరాబాద్ కి చెందిన కాసులు చిత్రకళా అకాడమీ అవార్డును రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ బండారు సత్యానందరావు గారి చేతులమీదుగా రామం అందుకున్నారు ఈ సందర్భంగా రామంని సత్యానందరావు గారు అభినందించి భవిష్యత్తు లో మరిన్ని అవార్డులు, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మన తెలుగువారికి గొప్ప పేరు, ప్రతిష్టలను తీసుకురావాలని పురోహితులు రామంను అభినందించారు. ఈ అవార్డులు సాధించడం రామం గారికే కాదు మనందరికీ కూడా గర్వకారణమని బండారు రామంను కొనియాడారు. వాడపాలెం గ్రామంలో బండారు స్వగృహం నందు జరిగిన ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, యల్లమిల్లి జగన్మోహన్, బూసి భాస్కరావు, పెద్దింటి కాశీ పాల్గొన్నారు.