కోనసీమ లో కాసిన యాపిల్ పండు
యాపిల్ పండును చుసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న కొత్తపేట వాసులు..
8 ఏళ్ల శ్రమకు దక్కిన ఫలితం
కొత్తపేట… యాపిల్ కాయడానికి వాతావరణం ఎంత మాత్రం సరిపడని కొనసీమ లో ఒక ఇంటి యజమాని తన పెరట్లో యాపిల్ కాయించి రికార్డును సొంతం చేసుకున్న సంఘటన కొత్తపేట శివారు పెద్దగూళ్ల పాలెంలో చోటు చేసుకుంది.యాపిల్ పండు అతి శీతల ప్రదేశాల్లో పండే ఫలం.జమ్ము, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాల్లో పండుతుంది.శీతల ప్రదేశాల్లో సాగుచేసిన యాపిల్స్ ను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు. దీనికి భిన్నంగా కోనసీమలో యాపిల్ పండు మొదటిసారిగా పండింది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో పండని ఈ ఆపిల్ ను కోనసీమలో ఓ వ్యక్తి తన పెరట్లో పండించాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, పెదగూళ్ళపాలానికి చెందిన దంగేటి వెంకటేశ్వరరావు ఈ ఘనత సాధించాడు. ఈ విషయం తెలిసిన పలువురు ఆపిల్ చెట్టును చూసి వెళ్తున్నారు. ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే యాపిల్ ఇక్కడ ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.