చిలకలూరిపేట పట్నం లో సోమేపల్లి సాంబయ్య వర్ధంతి వేడుకలు
చిలకలూరిపేట పట్నం హీరో హోండా షోరూం ఎదురు సోమేపల్లి సాంబయ్య. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకి పూలదండలు వేసి నివాళులు అర్పించిన మాజీ శాసనసభ్యులు ,వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మర్రి రాజశేఖర్.సోమేపల్లి సాంబయ్య ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారుఅని అన్నా మర్రి రాజశేఖర్.
చిలకలూరిపేటదివంగత నేత మాజీ శాసనసభ్యులు సోమేపల్లి సాంబయ్య నిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, రైతుల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని మాజీ శాసనసభ్యులు, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ అన్నారు.మంగళవారం మధ్యాహ్నం హీరో హోండా షోరూం సెంటర్లో ఉన్న సోమేపల్లి సాంబయ్య, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు.
మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ:-చిలకలూరిపేట నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతుల వ్యవసాయ భూములకు నీళ్లు అందించటమే కాకుండా పట్టణంలో ఆయా కాలనీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారన్నారు.ఈ విధంగా ప్రజలకు మరెన్నో సేవలు అందించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని రాజశేఖర్ పేర్కొన్నారు.ఆ తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీనికి ముందుగా తాతపూడి గ్రామంలోని సోమేపల్లి సాంబయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, సాంబయ్య అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.