తాళం వేసిన వేసిన దుకాణాలలో చోరీలకు పాల్పడే అంతర్ జిల్లా నిందితుడి అరెస్టు

2 కార్లు, ఎలెక్ట్రికల్ ప్రొజెక్టర్లు, సౌండ్ స్పీకర్లు, కంపుటర్ సామాగ్రి, లాప్ టాప్ , సెల్ ఫోన్ , నగదు రూ.17000/- స్వాధీనం
( వీటన్నింటి విలువ రూ. 11, 82, 800/- )

  • ప్రస్తుతం10 కేసుల్లో అరెస్టు, రికవరీ… ఇదివరకే 25 కేసుల్లో ఇతను నిందితుడు…
  • అరెస్టయిన నిందితుడి వివరాలు:
  • కరటూరి సాయి సత్య తేజ, వయస్సు 21 సం,రాలు, అంకంపల్లి గ్రామం, ఆత్రేయపురము మండలం, కోనసీమ జిల్లా.

** నేపథ్యం:

ఇతను స్పిన్నింగ్ మిల్ లో కూలీ పనులు చేసేవాడు. చిన్నప్పటినుండి కార్లు నడపడటం చాలా ఇష్టం. కారు సొంతంగా కొనుగోలు చేసి యజమాని కావాలని తపించేవాడు. దీనికి తోడు జల్సాలకు అలవాటుపడ్డాడు. కూలీ పనుల నుండీ వచ్చే డబ్బులతో ఇవేవీ తీరలేదు. ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించి సొంతంగా కారు కొనుక్కోవాలని భావించాడు. తాళం వేసిన దుకాణాలను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళ దొంగతనాలు మొదలు పెట్టాడు.

ఇదివరకే…గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, వెస్ట్ గోదావరి, తిరుపతి రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి పోలీసు స్టేషన్ ల పరిధిల్లో 25 దొంగతనాలు చేశాడు. ఆ కేసులలో అరెస్టయి జువైనల్ హోం కు వెళ్లొచ్చాడు. అయినా… ఇతనిలో మార్పు రాలేదు. జువెనల్ హోం నుండి బయటకు వచ్చాక కూడా షాపుల షట్టర్ తాళంను ఇనుప రాడ్డుతో పగులగొట్టి దొంగతనాలు చేశాడు. రాజనగరం, రాజమండ్రి అర్బన్, కావలి 2 టౌన్, ఒంగోల్ తాలూకా, నింద్ర, అనంతపురం 4 టౌన్, అనంతపురము 3 టౌన్, కర్నూల్ 3 టౌన్, కర్నూల్ 4 టౌన్ పోలీసు స్టేషన్ ల పరిధిల్లో 10 దొంగతనాలకు పాల్పడ్డాడు

** అరెస్ట్ వివరాలు:

అనంతపురము జిల్లా SP డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి గారి ఆదేశాల మేరకు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ మరియ CCS DSP మహబూబ్ బాష పర్యవేక్షణలో స్థానిక త్రీటౌన్ సి.ఐ కత్తి శ్రీనివాసులు మరియు సిబ్బంది SI వలి బాష , ASI చౌదరి , HCs శ్రీధర్ , శివయ్య PCs రంజిత్, శ్రీను , రమణ , మారుతి, నరేష్ , రాజశేఖర్ , మరియు CCS సిబ్బంది SI వెంకటేశ్వర్లు , HCs ఫారూఖ్ , శ్రీధర్ ఫణి , శ్రీనివాసులు బృందంగా ఏర్పడి ఇతనిని స్థానిక PTC సమీపంలో అరెస్టు చేశారు.

** స్వాధీనము చేసుకొన్నవి :

1). రెండు కార్లు
( Maruthi Ritz car ,
Maruthi swift Dzire car )
2) Panasonic Impact Laser Technology Projector
3) Cash Rs.17,000/-
4) Moco Android Music system
5)Sony speakers
6)JBL speakers
7) Sony 1300 wts woofers
8) Sony 1800 wts woofers
9) JBL amplifier
10) DVR 16 Camera hard disc