మత్స్యకార భరోసా ఐదవ విడత పంపిణీ కార్యక్రమం హైలైట్స్

 • నిజాంపట్నం లొ ఏర్పాటుచేసిన మత్స్యకార భరోసా ఐదవ విడత పంపిణీ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్:
 • సముద్రంలో వేట లేని సమయంలో ఏటా మత్సకారలుకు సాయం అందిస్తున్నాం
 • నేడు మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లు నేరుగా మత్సకారల ఖాతాలో వేస్తున్నాం
 • ఇప్పటి వరకు రూ. 538 కోట్ల మత్సకారల ఖాతాలో జమ వేశాం
 • గతంలో అరకొరగా భరోసా ఇచ్చేవారు
 • గతంలో 4వేలు ఇస్తే ఇప్పుడు 10వేలు ఇస్తున్నాం
 • ఇది మీ ప్రభుత్వమని గుర్తుపెట్టుకోండి
 • ఫిషరీస్‌ యూనివర్సిటీ, ఆక్వా పార్కును ఏర్పాటు చేయబోతున్నాం
 • మత్య్స, ఆక్వారంగాలకు మంచి జరిగేలా కార్యక్రమాలు..
 • నిపుణులను తయారు చేసే విధంగా ఫిషరీస్‌ యూనివర్సిటీ పశ్చిమ గోదావరిలో ఏర్పాటు
 • నిజాంపట్నం పరిధి దిండి గ్రామం వరుసవారి పాలెంలో 280 ఎకరాల స్థలంలో ఆక్వా పార్కుకు శంకుస్థాపన..
 • నాణ్యమైన ఫీడ్‌, సీడ్‌ అందించడమే దీని లక్ష్యం.. ఆక్వా పార్కు ఏర్పాటుతో అన్ని రకాల సీడ్‌లను తయారీ
 • నిజాంపట్నంలోనే సీడ్‌ మేకింగ్‌ యూనిట్‌.. 21వేల మందికి ఉపాధి కలుగుతుంది.
 • 417 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ను కూడా నిజాంపట్నంలో ఏర్పాటు చేయడం.. గర్వంగా ఉంది.