బాపట్ల జిల్లా చీరాల లో దొంగతనం

బాపట్ల జిల్లా చీరాల లో రాంనగర్ యస్.సి. కాలని రెండవ వార్డు సచివాలయంలో జరిగిన దొంగతనం కేసును చీరాల రెండవ పట్టణ పోలీస్ అధికారులు ఛేదించారు.చట్టంతో సంఘర్షిస్తున్న ఇద్దరు బాలురిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1 సి.పి.యూ, 1 ప్రింటర్, 2 మానిటర్లు, 1 లామినేటర్ లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన చీరాల రెండవ పట్టణ పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.ఈ సందర్భంగా కేసు వివరాలను చీరాల రెండవ పట్టణ సిఐ జి.సోమశేఖర్ మీడియాకు తెలియజేశారు.దొంగతనం కేసులో చీరాల మండలం రాంనగర్ ప్రాంతానికి చెందిన చట్టంతో సంఘర్షిస్తున్న బాలుడిని,ఈపూరుపాలెం గ్రామం ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన చట్టంతో సంఘర్షిస్తున్న బాలుడిని పోలీసులు పట్టుకోవటం జరిగిందని తెలిపారు.బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల డిఎస్పీ పి.శ్రీకాంత్ పర్యవేక్షణలో సదరు కేసును ఛేదించటానికి చీరాల రెండవ పట్టణ సిఐ జి.సోమశేఖర్ ఆధ్వర్యంలో, వారి పోలీస్ స్టేషన్ యస్.ఐ లు నాగరాజు, సురేష్ లు వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సదరు కేసుకు సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తుండగా చీరాల టూ టౌన్ పోలీస్ అధికారులకు ది.17.01.2023 ఉదయం సుమారు 08.10 నిముషాల సమయంలో రాబడిన ముందస్తు సమాచారం మేరకు చీరాల మండలం రాంనగర్, మరియు ఈపూరుపాలెం గ్రామం ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు చట్టంతో సంఘర్శిస్తున్న బాలురిని గుర్తించి, వారిని అదుపులోనికి తీసుకొని విచారించగా సచివాలయంలో దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో పాటు, చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని క్రైమ్ నెంబర్ 228/2022 U/s. 454, 380 IPC కేసులో మరియమ్మ పేట నందు ఒక ఇంటి తాళం పగులగొట్టి, ఐదు వేల రూపాయల నగదును దొంగతనం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో తక్షణమే స్పందించి రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించిన చీరాల రెండవ పట్టణ సిఐ జి.సోమశేఖర్ ను , ఎస్సైలు నాగరాజు, సురేష్ లను మరియు పోలీస్ సిబ్బంది బాజిత్, శివ ప్రసాద్, అహ్మద్ బాషా, సుబ్బారావు లను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.