ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ వ్యవస్థాపకులు కీ.శే. పడిశాల వీరభద్రయ్య గారి జయంతి

Share this:

ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ వ్యవస్థాపకులు కీ.శే. పడిశాల వీరభద్రయ్య గారి జయంతి – సందర్భంగా వరంగల్ లోని ఆ కాలేజీలో జరిగిన జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,ఈ కార్యక్రమంలో స్థానిక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, కళాశాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ వ్యవస్థాపకులు కీ.శే. పడిశాల వీరభద్రయ్య గారి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటిస్తున్నాను ఇదే సమయంలో 52 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజి అధ్యాపక బృందానికి, విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు!
వారి వారసులకు శుభ అభినందనలు!! పడిశాల వీరభద్రయ్య గారు అపర గాంధీ సౌమ్యులు, సాత్వికులు గాంధీజీ గారిని ఆయన కలిశారో లేదో కానీ, వారు గాంధీజీ గారి జీవితాన్ని అనుసరించారు గాంధీజీ గారి లాగే వారి జీవితం క్రమశిక్షణతో కూడినది ఒక పూట భోజనం. ఒక పూట ఆల్పాహారం ప్రతి సోమవారం మౌన వ్రతం పాటించేవారు అత్యంత క్రమ శిక్షణతో వ్యాపారాన్ని, సేవ ను ఏక కాలంలో కొనసాగించిన మహానుభావుడు ఒకసారి…ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు వస్తె, పూజ చేసుకుంటూ, బీరువా తాలం చెవి లు వాళ్లకు ఇచ్చే శారట!

అది వ్యపారంలోనూ వారి నిజాయితీకి నిదర్శనం అప్పట్లో ఆగి పోయిన వైశ్య సత్రం నిర్మాణం పూర్తి చేశారు,కోటి లింగాల గుడికి తన సొంత 2 ఎకరాల భూమి ఉచితంగా ఇచ్చారు అందులో ఒక ఎకరం అమ్మి, శాశ్వత పూజలు జరిగే విధంగా ఫిక్స్ చేశారు పిన్నవారి స్ట్రీట్ లోని దేవాలయాన్ని అభివృద్ధి చేసింది కూడా ఆయనే
స్త్రీలకు విద్య వద్దు అన్న రోజుల్లో…
బాలికల కోసం స్కూల్ ని, కాలేజీ ని పెట్టడం మామూలు విషయం కాదు
పడిశాల వీరభద్రయ్య గారు స్త్రీ విద్యాభివృద్ధి కొరకు ఈ కళాశాలను స్థాపించారు
స్త్రీలు మంచి చదువులు చదివి ఉన్నతంగా ఎదగాలని తపించారు
ఈ కాలేజీ ను నిర్మించే ముందు ఉస్మానియా యూనివర్శిటీ భవనాన్ని చూడగానే అక్కడ విద్యార్థిగా మారాలని అనుకున్నారు.
అట్లాగే జూనియర్ కాలేజీ భవనాన్ని చూడగానే ఇక్కడే చదవాలి అనిపించేలా… నిర్మించాలని అనుకున్నారు
అప్పట్లోనే 3 లక్షల రూపాయలు వెచ్చించి 2, 3 అంతస్థుల భవనం నిర్మించారు.
అలా మొదలైన కాలేజీ ప్రస్థానం నేటికీ 52 ఏళ్ళకి చేరుకున్నది.
ఈ 52 ఏళ్లలో మీలాంటి ఎందరో విద్యార్థినులకు విద్య లో బాసట గా నిలిచింది
ఎందరో విద్యార్థినులను ఉన్నత స్థానంలో నిలిపింది ఈ ఆంధ్ర బాలికల జూనియర్ కాలేజీ
పడిశాల వీరభద్రయ్య గారి లాంటి వాళ్ళ వల్లే ఇవ్వాళ మనలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఉద్యోగాలు చేసుకుంటున్నాం. చదువుకుంటున్నాము
వారి జీవితం అందరికీ ఆదర్శం