చిన్న వయసులోనే సంగీతంలో రాణిస్తున్న అంజలి గడ పాలే

Share this:

మహారాష్ట్రలోని ప్రముఖ నగరాల్లో ప్రదర్శన

నిర్మల్ (v3news)24-04-2022: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని నాగార్జున నగర్ కు చెందిన అంజలి గడపాలే అనే మూడో తరగతి విద్యార్థిని బింబిసార్ మౌనిక గడపాలే దంపతుల గారాలపట్టి ఆరవ ఏట నుండే పాటలు పాడడం ప్రారంభించింది. మహారాష్ట్రకు చెందిన సుప్రసిద్ధ గాయకులు వామన్ దాదా శిష్యులు ప్రముఖ గాయకులు ప్రతాప్ సింగ్ దేవా ఆంబోరేతో సన్మానం పొందింది. మహారాష్ట్రలోని నాందేడ్ అకోలా ముఖేడ్ వంటి ప్రధాన నగరాల్లో ఆనంద్ కీర్తనే, మేఘనంద్ జాదవ్, అజయ్ దేహడే, స్వప్న కరత్, అంజలి గోడకే, చేతన్ లోఖండే, విక్రాంత్ రాజ్ పుత్ తో కలిసి స్టేజీల మీద అంజలి పాడిన పాటలు శ్రోతలను కనివిందు చేసింది. అదేవిధంగా అదిలాబాద్ బైంసా నిర్మల్ ప్రాంతాల్లో స్టేజీల మీద ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న వయసులోనే సంగీతంలో రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. స్థానికులు సైతం అంజలిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో గానకోకిల లతా మంగేష్కర్, ఆశా భోస్లే వంటి ప్రముఖ గాయకుల సరసన చేరాలని ఆకాంక్షించారు. అదేవిధంగా హార్మోనియంలో సైతం ప్రావీణ్యం సంపాదించింది. ఇటు పాటలు పాడడంతో పాటు హార్మోనియం వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించిన అంజలిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. అమ్మ నాన్న ప్రోత్సాహంతోనే సంగీతంలో రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. అంజలి మరిన్ని అవార్డులు అందుకోవాలని స్థానికులు ఆకాంక్షించారు.

Leave a Reply